సామూహిక ఇఫ్తార్.. 71 ప్రదేశాలలో 35వేల మందికి ఆహారం
- March 22, 2024
యూఏఈ: సాయంత్రం 5:30 కాగానే అబూ హైల్, హోర్ అల్ అంజ్, బరాహా వంటి ఇతర పొరుగు ప్రాంతాలలోని వేలాది మంది నివాసితులు బీట్ అల్ ఖీర్ సొసైటీ ఆధ్వర్యంలోని సామూహిక ఇఫ్తార్ టెంట్‌కి చేరుకుంటారు. ఈ సొసైటీ యూఏఈలోని 71 ప్రాంతాలలో సేవలను అందిస్తుంది. రమదాన్ సందర్భంగా ప్రతిరోజూ 35,300 భోజనాలను పంపిణీ చేస్తుంది. దేశవ్యాప్తంగా 55 వంటశాలలలో భోజనం తయారు చేస్తారు. 94 మంది వాలంటీర్ల బృందం ఈ ఉదాత్తమైన సేవలను విజయవంతంగా అమలు చేస్తుంది. పాత దుబాయ్‌లోని హోర్ అల్ ఐంజ్ పరిసరాల్లోనే వాలంటీర్లు 3,500 మందికి పైగా వ్యక్తులను ఇఫ్తార్ విందును అందజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి లాబన్, బియ్యం, హరీసా, నీరు, పండ్లు, ఖర్జూరాలు మరియు స్వీట్లతో కూడిన ఇఫ్తార్ బాక్స్‌ను అందజేస్తారు. ఉపవాసం ఉన్నప్పటికీ వాలంటీర్లు రోజంతా అవిశ్రాంతంగా పని చేస్తారు. ఇఫ్తార్ కోసం ఆహారాన్ని సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి ఉదయం నుంచే పనిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4:00 గంటలకు వాలంటీర్లు టెంట్‌ను శుభ్రం చేసి సిద్ధం చేస్తారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







