సరదాగా కిక్‌బాక్సింగ్.. కోమాలోకి వెళ్లిన యువకుడు
- March 22, 2024
దుబాయ్: ఇద్దరు తోటి విద్యార్థుల మధ్య జరిగిన స్నేహపూర్వక మ్యాచ్ కారణంగా ఒక టీనేజ్ బాలుడు కోమాలోకి వెళ్లాడు. గత ఏడాది నవంబర్ 4న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో JBR ప్రాంతంలో ఇసుకతో కూడిన పిచ్‌పై జరిగిన ఈ సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బ్రిటిష్ స్కూల్‌మేట్ తో కిక్‌బాక్సింగ్ మ్యాచ్ ఆడాడు. ఇద్దరూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ సందర్భంగా తగిలిన దెబ్బతో అమెరికాకు చెందిన యువకుడు అపస్మారక స్థితికి చేరాడు. అనంతరం రషీద్ ఆసుపత్రికి తరలించారు. మెదడు వెలుపల రక్తస్రావం కలిగడంతో ఆపరేషన్ చేసారు. బాధితుడు చాలా రోజులు కోమాలో ఉండి చివరకు డిసెంబర్ 15న డిశ్చార్జ్ చేశారు. కిక్‌బాక్సింగ్ మ్యాచ్‌ను పాఠశాల విద్యార్థుల మధ్య స్నేహపూర్వక క్రీడగా పేర్కొంటూ.. కేసు దుబాయ్ జువెనైల్స్ మిస్డిమినర్ కోర్టుకు వెళ్లింది. “అతను (బాధితుడు) నా స్నేహితుడు. మేము ఆడుకుంటున్నాము. అతడిని బాధపెట్టాలని నా ఉద్దేశ్యం కాదు’’ అని నిందితుడు కోర్టు రికార్డుల్లో పేర్కొన్నాడు. మార్చి 27న తుది తీర్పు వెలువడనుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







