దుబాయ్ గురుద్వారాలో ఇఫ్తార్‌.. పాల్గొన్న ప్రముఖులు

- March 22, 2024 , by Maagulf
దుబాయ్ గురుద్వారాలో ఇఫ్తార్‌.. పాల్గొన్న ప్రముఖులు

దుబాయ్: జెబెల్ అలీలోని గురునానక్ దర్బార్ లో ఇఫ్తార్ అందరినీ ఆకట్టుకున్నది. గురువారం గురుద్వారాలో నిర్వహించిన వార్షిక సర్వమత ఇఫ్తార్‌లో 250 మందికి పైగా వ్యక్తులు పాల్గొన్నారు. గురునానక్ దర్బార్ గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ సురేందర్ సింగ్ కంధారి మాట్లాడుతూ.. రమదాన్ మాసం అనేది మన ముస్లిం సోదరులు, సోదరీమణులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందన్నారు. ఇది ఆధ్యాత్మిక పునరుద్ధరణ, స్వీయ-క్రమశిక్షణ మరియు కృతజ్ఞత యొక్క సమయం అని అన్నారు.  ఈ ఇంటర్‌ఫెయిత్ ఇఫ్తార్  నేపథ్యాన్ని దర్బార్ గురుద్వారా వైస్-ఛైర్‌పర్సన్ బబుల్స్ కంధారి వివరిస్తూ.. తాము ఇప్పటికే 2012లో సర్వమత సమ్మేళనాన్ని ప్రారంభించామని, ఈ రోజు 250 మంది కంటే ఎక్కువ మంది పాల్గొంటున్నారని తెలిపారు. ఇఫ్తార్‌కు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తోపాటు ఇస్లామిక్ అఫైర్స్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (IACAD) నుండి మేజర్ జనరల్ అహ్మద్ ఖల్ఫాన్ అల్ మన్సూరి, ప్రముఖ ఎమిరాటీ సభ్యుడు, మాజీ దౌత్యవేత్త మీర్జా అల్ సయెగ్,మాజీ భారత రాయబారి వేణు రాజమోని, డైరెక్టర్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (CDA) దుబాయ్ మహ్మద్ అల్ ముహైరి, అలాగే వివిధ దౌత్య దళాల ప్రతినిధులు, వివిధ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.  భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ.. వివిధ మతాలు, విశ్వాసాలు మరియు జాతీయతల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, ప్రతి సంవత్సరం గురునానక్ దర్బార్ గురుద్వారాలో ఈ వైవిధ్యం ఒక సాధారణ దృశ్యమని పేర్కొన్నారు. ఈ నెల పవిత్రమైన రమదాన్ మాసం తోపాటు మహా శివరాత్రి (భారతీయ పండుగ),  నౌరూజ్ (పర్షియన్ నూతన సంవత్సరం) ,  హోలీ (భారతీయ రంగుల పండుగ),  గుడ్ ఫ్రైడే (క్రైస్తవ మతంలో ముఖ్యమైన రోజు) రావడం యాదృచ్చికం అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com