బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది?

- March 23, 2024 , by Maagulf
బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకొస్తుంది?

తలకి తీవ్రమైన గాయం తగలడం.. లేదంటే హైబీపీ కంట్రోల్‌లో లేకపోవడం.. తదితర కారణాలు బ్రెయిన్ స్రోక్‌కి దారి తీసే పరిస్థితులు. బ్రెయిన్ స్ర్టోక్‌లో కీలకంగా జరిగేది.. బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవడం.
ఇలా బ్రెయిన్‌లో రక్త స్రావం కావడం వల్ల నరాలు చిట్లిపోయి పక్షపాతం రావచ్చు. పరిస్థితి శృతి మించితే ప్రాణాపాయం కూడా కలగొచ్చు. అందుకే అనుకోకుండా కింద పడి తలకి దెబ్బ తగలడాన్ని అస్సలు అశ్రద్ధ చేయరాదని తగిన సమయంలో చికిత్స తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే హైబీపీని కూడా లైట్ తీసుకోరాదని సూచిస్తున్నారు. అంతేకాదు, తాజా అధ్యయనాల్లో తేలిన విషయమేంటంటే తీవ్రమైన తలనొప్పిని కూడా అశ్రద్ధ చేయరాదని అంటున్నారు. తీవ్రమైన తలనొప్పి కూడా బ్రెయిన్ బ్లీడింగ్‌కి రీజన్ కావచ్చు. ఆకస్మికంగా కళ్లు తిరగడం, తీవ్రమైన బలహీనత, ముఖం, కాళ్లు, లేదా చేతుల్లో తిమ్మిరి, వాపులు ఈ సమస్యకు ప్రాధమిక సూచనలుగా చెబుతున్నారు.
ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకుండా.. సీటీ స్కాన్, ఎమ్‌ఆర్ఏ స్కాన్ వంటి టెస్టులు చేయించుకుని వ్యాధిని ముందుగానే పసిగట్టి.. తగిన చికిత్స చేయించాల్సిన అవసరం వుందని నిపుణులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com