ప్రపంచంలోని ఏకైక డ్రాగన్ బాల్ థీమ్ పార్క్.. ఖిడియా సిటీలో ప్రారంభం

- March 23, 2024 , by Maagulf
ప్రపంచంలోని ఏకైక డ్రాగన్ బాల్ థీమ్ పార్క్.. ఖిడియా సిటీలో ప్రారంభం

రియాద్:  కిడియా వినోదం, క్రీడలు మరియు సంస్కృతికి సాటిలేని గ్లోబల్ గమ్యస్థానంగా మారనుంది. ప్రపంచంలోని ఏకైక డ్రాగన్ బాల్ థీమ్ పార్క్ ప్రారంభమైంది. ఏడు డ్రాగన్ బాల్స్ స్ఫూర్తితో ఏడు ప్రత్యేకమైన థీమ్ జోన్‌లలో 30 కంటే ఎక్కువ రైడ్‌లు మరియు ఆకర్షణలను ఆస్వాదించవచ్చు. ఈ ప్రకటన జపనీస్ ప్రముఖ యానిమేషన్ కంపెనీ మరియు డ్రాగన్ బాల్ యొక్క అసలైన సృష్టికర్తలైన కిడ్డియా,  టోయ్ యానిమేషన్ మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. రియాద్ నుండి కేవలం 40 నిమిషాల దూరంలో కిడియా సిటీలో ఉన్న ఈ అపూర్వమైన యానిమే థీమ్ పార్క్ మొత్తం డ్రాగన్ బాల్ సిరీస్‌లోని అత్యంత గుర్తుండిపోయే కథాంశాలు, పాత్రలకు జీవం పోస్తూ అర మిలియన్ చదరపు మీటర్లకు పైగాస్థలంలో విస్తరించి ఉంది.  థీమ్ పార్క్ అనుభవాన్ని పునర్నిర్వచించే ఐదు వినూత్న ఆకర్షణలతో సహా 30 రైడ్‌లను ఆస్వాదించవచ్చు. 70-మీటర్ల భారీ షెన్రాన్ విగ్రహం చుట్టూ తిరిగే రోలర్‌కోస్టర్ ప్రత్యేకమైన అట్రాక్షన్. వీటితోపాటు పార్క్‌లోని థీమ్ హోటల్‌లు శాశ్వతమైన జ్ఞాపకాలను అందించనుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com