తమ్ముడి బర్త్ డేని దగ్గరుండి సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్..
- March 23, 2024
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి కోట్లలో అభిమానులు ఉన్నారని తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు కూడా చిరంజీవికి అభిమానులే. అలాంటి వాళ్ళల్లో శ్రీకాంత్ ఒకరు. హీరో శ్రీకాంత్ చిరంజీవిని అన్నయ్య అంటూ పిలుస్తారు. చిరంజీవి కూడా తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటారు. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి శంకర్ దాదా mbbs, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్ వేసిన ATM పాత్ర బాగా హిట్ అయింది.
తాజాగా నేడు శ్రీకాంత్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవి స్వయంగా శ్రీకాంత్ ఇంటికి కేక్ తీసుకొని వెళ్లి కేక్ కట్ చేయించి తినిపించారు. అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీతో సరదాగా కాసేపు గడిపారు. శ్రీకాంత్ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు. కేక్ మీద హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం విశేషం. శ్రీకాంత్ బర్త్ డేని చిరంజీవి స్వయంగా వెళ్లి సెలబ్రేట్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ విషయంలో చిరంజీవిని అంతా అభినందిస్తుండగా శ్రీకాంత్, చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం మరోసారి వైరల్ అవుతుంది. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు శ్రీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు