ఈద్ అల్ ఫితర్ 2024.. 6 రోజులపాటు సెలవులు
- March 25, 2024
రియాద్: సౌదీ అరేబియాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఏప్రిల్‌లో ఈద్ అల్ ఫితర్ కోసం 4 రోజుల సెలవులు లభిస్తాయని సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చాలా మంది ఉద్యోగులకు ఏప్రిల్ 8 (రంజాన్ 29, 1445) నుండి నాలుగు రోజులు సెలవు లభిస్తుందని శనివారం అధికారులు ప్రకటించారు. శుక్రవారం, శనివారాలు సౌదీలో అధికారిక వారాంతపు రోజులు కాబట్టి, సౌదీ నివాసితులు వరుసగా ఆరు రోజులు సెలవులు పొందుతారు. ఏప్రిల్ 14న (ఆదివారం) ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరుకుంటారని పేర్కొన్నారు. కార్మిక చట్టంలోని ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ ఆర్టికల్ 24లోని రెండవ పేరాలో పేర్కొన్న దానికి యజమానులు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఏఈ నివాసితులు ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ ఫితర్‌ను జరుపుకోవడానికి ఏప్రిల్‌లో తొమ్మిది రోజుల వరకు సెలవును పొందవచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. నివాసితులు ఈద్ అల్ ఫితర్ జరుపుకోవడానికి రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు సెలవులు పొందుతారు. రంజాన్ 30 రోజులు ఉంటే, ఈద్ ఏప్రిల్ 10 న... నెల 29 రోజులు ఉంటే, ఇస్లామిక్ పండుగ ఏప్రిల్ 9న వస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన