కరాచీ వీధుల్లో హోలీ జరుపుకున్న పాకిస్థానీ హిందువులు
- March 25, 2024
పాకిస్థాన్లోని కరాచీలో హిందూ కమ్యూనిటీ హిందువుల రంగుల పండుగ హోలీని చాలా కోలాహలంగా, ఉత్సాహంగా జరుపుకుంది. ఈ పండుగ హిందూ దేవుడు కృష్ణుడు తన భార్య రాధ, ఆమె స్నేహితులను ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, కుంకుమ రంగులతో చల్లడం అనే పురాణం చుట్టూ తిరుగుతుంది. రంగుల పౌడర్ పూసుకున్న భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పాటలకు నృత్యాలు చేశారు. వేడుకల్లో భాగంగా వారు స్వీట్లు కూడా పంచుకున్నారు. “హోలీ నాకు అత్యంత ఇష్టమైన పండుగ. నేను హోలీ వేడుకలకు చాలా ముందుగానే సిద్ధమవుతాను. నేను నిన్న నా కుటుంబంతో జరుపుకున్నాను. ఈ రోజు కూడా నేను నా కుటుంబం, స్నేహితులతో జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాను" అని కరాచీ నివాసి రితికా చెప్పారు. “హోలీ అనేది రంగుల పండుగ. హిందువులే కాకుండా పాకిస్థానీలందరి జీవితాల్లో ఆనందం, అందం, శాంతి రంగులతో జీవితాన్ని నింపాలని దేవున్ని మేము ప్రార్థిస్తున్నాము" అని కరాచీ నివాసి సీమా మహేశ్వరి అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు