ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది...
- March 25, 2024
ఐపీఎల్ 2024 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు జట్లు హోరాహోరీగా తలపడతున్నాయి. ఈ క్రమంలో తాజా సీజన్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.
ఎన్నికల నేపథ్యంలో యూఏఈలో నిర్వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ వాటిన్నింటిని కొట్టిపారేస్తూ మెుత్తం మ్యాచ్ లను భారత్‌లోనే నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ఉన్నప్పటికీ.. మెుత్తం 74 మ్యాచులను మనదేశంలోనే నిర్వహించనున్నారు. అంతేకాదు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లను మోథేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలోనూ, క్వాలిఫైయర్ 2 మరియు ఫైనల్ మ్యాచులను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మే 26వ తేదీన టైటిల్ పోరు జరగనుంది. అంటే 12 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ తుది పోరుకు చెపాక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతుంది.
రెండో దశ మ్యాచ్‌లు ఎప్పటి నుంచంటే..
ఏప్రిల్ 7వ తేదీన తొలి దశ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత రోజు నుంచే రెండో దశ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్(CSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్లు తలపడనున్నాయి. మే 21వ తేదీన క్వాలిఫయర్ 1, మే 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 24వ తేదీన క్వాలిఫయర్ 1, మే 26న ఫైనల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన