సర్వజనీయమైన రంగస్థలం...!
- March 26, 2024
ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తేవడంలో నాటక కళ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ప్రతి యేటా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటక రంగ కళాకారుల కోసం జరుపుకునే ఉత్సవం ప్రపంచ రంగస్థల దినోత్సవం.
ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలయి సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది.కాలాన్ని బట్టి , ప్రదేశాన్ని బట్టి నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా అందరికి ఒకటే ఉంటుంది. అందువల్ల ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రోజున రంగస్థల ఔత్సాహికులందరు కలిసి సంబరాలు చేసుకుంటారు. అవార్డు కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఛారిటీ నాటకాలు, థియేటర్ వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని 1962 నుంచి అంతర్జాతీయ థియేటర్ ఇన్స్టిట్యూట్ సెంటర్, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ కోఆపరేటింగ్ సభ్యులు, థియేటర్ నిపుణులు, థియేటర్ సంస్థలు, థియేటర్ విశ్వవిద్యాలయాలు, థియేటర్ ప్రేమికులు నిర్వహించుకుంటున్నారు.
మనిషి మనుగడ కొనసాగినంత కాలం పరస్పరం కథలు చెప్పుకున్నారు, చెప్పుకుంటూనే ఉంటారు. అందమైన ఈ రంగస్థల సంస్కృతి మనం ఉన్నంత కాలం అదీ బ్రతికే ఉంటుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు