40శాతం ట్రేడ్లలో 2వ దశ సౌదైజేషన్ ప్రారంభం
- March 27, 2024
రియాద్: మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండవ దశ కన్సల్టింగ్ సేవల వృత్తుల సౌదైజేషన్ మార్చి 25 నుండి అమల్లోకి వచ్చిందని ప్రకటించింది. రెండవ దశ కన్సల్టింగ్ సేవలకు సంబంధించిన 40 శాతం వృత్తులను కవర్ చేస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ కన్సల్టింగ్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ కన్సల్టింగ్, హెల్త్ కన్సల్టింగ్ మరియు సీనియర్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ రంగాలకు ఉద్దేశించినదని పేర్కొంది. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాల్లోని పౌరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలలో ఇది భాగంగా ఉందని వెల్లడించింది. రెండవ దశలో కన్సల్టింగ్ సేవల సౌదైజేషన్ కింద వచ్చే ప్రధాన వృత్తులలో ఫైనాన్షియల్ కన్సల్టింగ్ స్పెషలిస్ట్, బిజినెస్ కన్సల్టింగ్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టింగ్ స్పెషలిస్ట్, మేనేజర్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఉన్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లేబర్ మార్కెట్లో సౌదీల భాగస్వామ్య స్థాయిని పెంచడం కోసం ఈ వృత్తుల సౌదైజేషన్ రెండవ దశను అమలు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు