ప్రైవేట్ రంగం, చిన్న వ్యాపారాలకు ‘ఫ్యూచర్ ఫండ్’ చేయూత

- March 27, 2024 , by Maagulf
ప్రైవేట్ రంగం, చిన్న వ్యాపారాలకు ‘ఫ్యూచర్ ఫండ్’ చేయూత

మస్కట్: ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) తన మూడవ రమదాన్ ఈవెనింగ్ ప్రోగ్రామ్ లో భాగం ఫ్యూచర్ ఫండ్ ఒమన్ సమీక్ష నిర్వహించింది. ఫండ్ యొక్క మిషన్, లక్ష్యాలు, పని విధానాలు, ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యాల రకాలు,  చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (SMEలు) ఫైనాన్స్‌లో ఫండ్ పాత్ర గురించి కూడా చర్చించినట్లు ఫ్యూచర్ ఫండ్ ఒమన్ ఇన్వెస్ట్‌మెంట్స్ సీనియర్ మేనేజర్ రషీద్ బిన్ సుల్తాన్ అల్ హష్మీ తెలిపారు. ఒమన్ ఫ్యూచర్ ఫండ్ ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, ప్రైవేట్ రంగంలో పాటు పెట్టుబడిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను సమీక్షించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా పర్యాటక రంగం, పారిశ్రామిక రంగం, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ల రంగం, మైనింగ్ రంగం, వ్యవసాయం మరియు మత్స్య రంగం, ఓడరేవులు మరియు లాజిస్టిక్స్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.  ఫండ్ మూలధనం OMR2 బిలియన్లు. ఈ ఫండ్ 2024 నుండి 2028 వరకు ప్రతి సంవత్సరం OMR400 మిలియన్లకు ఫైనాన్స్ అందిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com