వేసవిలో చికెన్‌పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- March 27, 2024
యూఏఈ: పెద్దలు మరియు పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే చికెన్‌పాక్స్ కేసుల పెరుగుదలను ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున చికెన్‌పాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈలోని వైద్యులు నివాసితులను కోరుతున్నారు. ఇన్ఫెక్షియస్ వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ జ్వరం, గొంతు నొప్పి మరియు విలక్షణమైన దద్దుర్లు వంటి లక్షణాలతో వ్యక్తమవుతుందని వైద్యులు వివరించారు. తుంబే యూనివర్శిటీ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఫిజీషియన్ డాక్టర్ ఫియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ..వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ, సీజన్‌తో ముడిపడి ఉన్న వివిధ కారణాల వల్ల చికెన్‌పాక్స్ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట లేదా ప్రయాణంలో గడుపుతారని, దీంతో వరిసెల్లా-జోస్టర్ వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి మరిన్ని అవకాశాలను ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పార్కులు, కొలనులు మరియు పిల్లల శిబిరాలు వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో పిల్లల ఆడుకునే సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వరిసెల్లా-జోస్టర్ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకాక 10-21 రోజులలో దద్దుర్లు కనిపిస్తాయని స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రైమ్ మెడికల్ సెంటర్ మోటార్ సిటీ బ్రాంచ్ డాక్టర్ పవిత్ర వి.రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన