గోపీచంద్‌కి హిట్ రావాలంటే ఆ కాంబో సెట్ అవ్వాల్సిందేనా.?
- March 27, 2024
రాధాక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ మూవీ మ్యాచో స్టార్ గోపీచంద్‌కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్‌కి ఆ స్థాయి హిట్ ఇచ్చిన సినిమా పడలేదనే చెప్పాలి.
రీసెంట్‌గా ‘భీమా’ సినిమాతో భారీ అంచనాలు నమోదు చేశాడు కానీ, రిలీజ్ తర్వాత తుస్‌మనిపించాడు. దాంతో, మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసేసుకున్నాడు గోపీచంద్.
అయినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా తర్వాతి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టాడు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘విశ్వం’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి అనుకుంటున్నారు.
దీంతో పాటూ, త్వరలోనే తన హిట్ కాంబో రాధాకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. శీను వైట్ల ‘విశ్వం’ రిజల్ట్ ఎలా వున్నా.. రాధాకృష్ణ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని గోపీచంద్ అభిమానులు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు