గోపీచంద్‌కి హిట్ రావాలంటే ఆ కాంబో సెట్ అవ్వాల్సిందేనా.?
- March 27, 2024రాధాక్రిష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జిల్’ మూవీ మ్యాచో స్టార్ గోపీచంద్‌కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఆ తర్వాత గోపీచంద్‌కి ఆ స్థాయి హిట్ ఇచ్చిన సినిమా పడలేదనే చెప్పాలి.
రీసెంట్గా ‘భీమా’ సినిమాతో భారీ అంచనాలు నమోదు చేశాడు కానీ, రిలీజ్ తర్వాత తుస్మనిపించాడు. దాంతో, మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసేసుకున్నాడు గోపీచంద్.
అయినా ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా తర్వాతి ప్రాజెక్టుల మీద ఫోకస్ పెట్టాడు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ‘విశ్వం’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి అనుకుంటున్నారు.
దీంతో పాటూ, త్వరలోనే తన హిట్ కాంబో రాధాకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు గోపీచంద్. యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. శీను వైట్ల ‘విశ్వం’ రిజల్ట్ ఎలా వున్నా.. రాధాకృష్ణ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని గోపీచంద్ అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు