‘టిల్లు స్క్వేర్’ హంగామా మామూలుగా లేదుగా.!
- March 27, 2024
‘డీజె టిల్లు’ సూపర్ హిట్ కావడంతో ‘టిల్లు స్క్వేర్’ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయ్. వీలైనంత త్వరగానే ఈ సినిమాని పూర్తి చేసేశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. కానీ, ‘డీజె టిల్లు’ అంచనాల్ని ఈ సినిమా అందుకుంటుందా.? అంటే, అనుమానాలున్నాయ్.
కేవలం ఈ సినిమాని అనుపమ హాట్ హాట్ అందాలతోనూ, హీరోతో లిప్‌లాక్స్‌తోనూ నింపేశారనిపిస్తోంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ఆ యాంగిల్ నుంచే కనిపిస్తున్నాయ్.
యూత్ టార్గెట్‌గానే ఈ సినిమాని తెరకెక్కించారనుకోండి. అయితే, మరీ ఈ రేంజ్‌లో రొమాన్స్ అంటేనే కాస్త జుగుప్స కలిగించేలా వుంది. అయితే, ప్రోమోల్లో వున్న హాట్‌నెస్, రిలీజ్ తర్వాత సినిమాలో వుంటుందనీ, వుండాలనీ రూల్ లేదనుకోండి.
ప్రమోషన్లు మాత్రం ఆ యాంగిల్‌లోనే చేస్తూ, యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి కథ, కాకరకాయ్ ఏమీ లేదు.. కేవలం ఎంటర్‌టైన్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. అంతే.! మొదటి పార్ట్‌లో రాధిక చేతిలో బాధితుడిగా టిల్లు గాని అల్లరి.. ఈ పార్ట్‌లో లిల్లీ చేతిలో బాధితుడిగా టిల్లుగాని హంగామా.! అని సినిమా లైన్‌ని ఒక్క మాటలో చెప్పేశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ.
ఏది ఏమైనా ఈ శుక్రవారం రెండో టిల్లుగాని భవితవ్యం ఏంటో అర్ధమైపోతుంది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు