‘టిల్లు స్క్వేర్’ హంగామా మామూలుగా లేదుగా.!
- March 27, 2024‘డీజె టిల్లు’ సూపర్ హిట్ కావడంతో ‘టిల్లు స్క్వేర్’ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయ్. వీలైనంత త్వరగానే ఈ సినిమాని పూర్తి చేసేశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ. కానీ, ‘డీజె టిల్లు’ అంచనాల్ని ఈ సినిమా అందుకుంటుందా.? అంటే, అనుమానాలున్నాయ్.
కేవలం ఈ సినిమాని అనుపమ హాట్ హాట్ అందాలతోనూ, హీరోతో లిప్లాక్స్తోనూ నింపేశారనిపిస్తోంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ ఆ యాంగిల్ నుంచే కనిపిస్తున్నాయ్.
యూత్ టార్గెట్‌గానే ఈ సినిమాని తెరకెక్కించారనుకోండి. అయితే, మరీ ఈ రేంజ్లో రొమాన్స్ అంటేనే కాస్త జుగుప్స కలిగించేలా వుంది. అయితే, ప్రోమోల్లో వున్న హాట్నెస్, రిలీజ్ తర్వాత సినిమాలో వుంటుందనీ, వుండాలనీ రూల్ లేదనుకోండి.
ప్రమోషన్లు మాత్రం ఆ యాంగిల్లోనే చేస్తూ, యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకి కథ, కాకరకాయ్ ఏమీ లేదు.. కేవలం ఎంటర్టైన్ చేయడమే మా మెయిన్ టార్గెట్.. అంతే.! మొదటి పార్ట్‌లో రాధిక చేతిలో బాధితుడిగా టిల్లు గాని అల్లరి.. ఈ పార్ట్‌లో లిల్లీ చేతిలో బాధితుడిగా టిల్లుగాని హంగామా.! అని సినిమా లైన్‌ని ఒక్క మాటలో చెప్పేశాడు హీరో సిద్దు జొన్నలగడ్డ.
ఏది ఏమైనా ఈ శుక్రవారం రెండో టిల్లుగాని భవితవ్యం ఏంటో అర్ధమైపోతుంది. మార్చి 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!