వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- March 28, 2024
రియాద్: పర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పింది. సౌదీ అరేబియా మార్చి 27ని వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డేగా ప్రకటించింది. ఈ రోజు ప్రతిష్టాత్మకమైన సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ (SGI)కి అనుగుణంగా మరింత స్థిరమైన భవిష్యత్తును సాధించే దిశగా రాజ్యమంతటా అవగాహనను పెంపొందించనున్నారు. "ఫర్ అవర్ టుడే అండ్ దేర్ టుమారో: KSA టుగెదర్ ఫర్ ఎ గ్రీన్నర్ ఫ్యూచర్" అనే థీమ్ తో సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే ని జరుపుకోనున్నారు. #ForAGreenerSaudi అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పచ్చని సౌదీ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదటి సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే వేడుకలు గ్రీన్ ఎకానమీలో SR705 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో 80కి పైగా కార్యక్రమాలను నిర్వహించినట్లు వెల్లడించింది. ఇప్పుడు సౌదీ అరేబియాలో 18.1% భూమి మరియు 6.49% సముద్ర పరిసరాలతో రక్షిత భూమి, సముద్ర ప్రాంతాల పెంపుదలన చేపట్టారు. మార్చి 27, 2021న క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించిన సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్.. రాజ్య సుస్థిరత ప్రయత్నాలను ఏకం చేయడానికి, మెరుగుపరచడానికి ఒక సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌గా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు