సినిమా రివ్యూ: ‘టిల్లు స్క్వేర్’
- March 29, 2024‘డీజె టిల్లు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. అదే హుషారుతో సెకండ్ పార్ట్ పూర్తి చేసేశాడు సిద్దు జొన్నలగడ్డ. అదే ఈ ‘టిల్లు స్క్వేర్’. ‘డీజె టిల్లు’కి మించిన కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ ఎిపసోడ్స్, గ్లామర్ డోస్.. ఇలా అన్ని డోసులు డబుల్ చేశారు. మరి ఈ డబుల్ డోస్ ‘టిల్లు స్క్వేర్’ ఎలా ఆకట్టుకుందో తెలియాలంటే ‘టిల్లు స్క్వేర్’ కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
మొదటి పార్ట్‌లో రాధిక కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు టిల్లు (సిద్దు జొన్నలగడ్డ). ఆ క్రమంలోనే మ్యారేజ్ ఈవెంట్లు చేసుకుంటూ కాలం గడిపేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టిల్లుగానికి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. మొదటి పార్ట్‌లో రాధిక మాదిరిగానే తన బర్త్ డే అని చెప్పి టిల్లుగాని సాయం కోరుతుంది. సేమ్ సిట్యువేషన్ రిపీట్. మరి, రాధికా బాధితుడు మళ్లీ లిల్లీ చెరలో పడి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వీరి స్టోరీలోకి పేరు మోపిన మాఫియా డాన్ మెహబూబా (మురళీ శర్మ) ఎందుకు ఎంటరయ్యాడు.? లిల్లీతోనైనా సిద్దుగాని లవ్ లైఫ్ హ్యాపీగా నడిచిందా.? లేదంటే మళ్లీ ట్విస్టులతోనే ముగిసిందా.? అసలు మొదటి పార్ట్ మాదిరి ఎక్స్‌ట్రా డోస్ ‘టిల్లు స్క్వేర్’ ఫుల్ ఫన్‌తో అలరించిందా.? తెలియాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
యూత్ స్టార్ సిద్దు జొన్నలగడ్డ.. యాజ్ యూజ్‌వల్ తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయాడు. వన్ మ్యాన్ షోలా తనదైన కామెడీ టైమింగ్‌తో నూటికి నూరు మార్కులేయించుకున్నాడు. కొన్ని చోట్ల హ్యాండ్సమ్ లుక్స్‌తో కనిపించి అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టేశాడు. సింగిల్ లైన్ డైలాగ్స్‌తో యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయాడు. ఇక, అనుపమ విషయానికి వస్తే.. గతంలో ఎన్నడూ లేని మాదిరి గ్లామర్ పండించేసింది. హీరోతో డీప్ లిప్‌లాక్స్, ఘాటు రొమాన్స్.. ఇలా ప్రమోషనల్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమాలోనూ తనదైన హాట్‌నెస్‌తో చంపేసింది. అలాగే, పర్‌పామెన్స్‌లోనూ ఎక్కడా తగ్గలేదు. సెకండాఫ్‌లో సర్‌ప్రైజింగ్ ట్విస్ట్ ఇచ్చి కేక పుట్టించింది. మురళీ శర్మ క్యారెక్టర్ పెద్దగా కొత్తదనమేమీ లేదు. చెప్పాలంటే కాస్త స్లోగా నడిచింది. మరో నటుడు మురళీధర్ గౌడ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు తనకున్న స్పేస్‌లో. ప్రిన్స్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో తనదైన పనితనం చూపించాడు. కాస్త కొత్త కథను రాసుకుంటే ఇంకా బాగుండేది. అనుకున్న కథని ఇంకాస్త ఫాస్ట్ నెరేషన్‌తో నడిపించినా బాగుండేది. ఓవరాల్‌గా తనదైన స్క్రీన్‌ప్లేతో ఒకింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎడిటర్ నవీన్ నూలి ఇంకాస్త తన కత్తెరకు పదును పెట్టి వుంటే బాగుండేది. రామ్ మిరియాల, అచ్చు రాజుమణి, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. వున్న బడ్జెట్‌లో సినిమాని అందంగా చూపించాడు. అక్కడక్కడా గ్రాఫిక్స్ కూడా కథకు తగ్గట్లుగా వున్నాయ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, రాధిక అప్టేటెడ్ వెర్షన్‌లా అనుపమ పర్‌ఫామెన్స్, ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ట్విస్టులు..
మైనస్ పాయింట్స్:
స్లోగా అనిపించిన కథనం, కథలో కొత్తదనం లేకపోవడం.. చాలా చోట్ల రొటీన్‌గా అనిపించిన సన్నివేశాలు.. ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే కామెడీ టైమింగ్ మిస్ అవ్వడం.. లాజిక్కుల్లేని సన్నివేశాలు..
ఫైనల్‌గా
కొత్తదనం ఆశించకుండా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లకి ‘టిల్లు స్క్వేర్’ జస్ట్ ఓకే. సిద్దు జొన్నలగడ్డ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్‌మెంట్, అనుపమ గ్లామర్ డోస్ కెవ్వు కేక.
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్