FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- March 29, 2024హైదరాబాద్: నిర్మాతగా ఇంద్రాణి, సునామి వంటి అనేక చిత్రాలను నిర్మించి సినీ సంబంధిత పలు శాఖలలో పనిచేసిన గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా నియమిస్తూ సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమం లో తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అధ్యక్ష కార్యదర్సులు అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు చైతన్య జంగా మాట్లాడుతూ :- జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబందించిన 24 సబ్ కమిటీల సమన్వయ చైర్మన్ గా ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి మధుకర్ కృషి చేస్తారని అన్నారు.మధుకర్ మాట్లాడుతూ :- అంతర్ రాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాల కై కృషి చేస్తానని అన్నారు.ఇప్పటికే 10 రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసిన తాము ఈశాన్య రాష్ట్రాల కమిటీలను అతిత్వరలో ఏర్పాటు చేయనున్నామని , తద్ఫలితంగా నట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకొనే అవకాశాలు మెరుగవుతాయని ప్రధాన కార్యదర్శి వీస్ విజయ్ వర్మ పాకలపాటి అన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి