నారా రోహిత్ మళ్లీ వస్తున్నాడు.!
- March 30, 2024
కంటెంట్ వున్న కథలకు పెట్టింది పేరు హీరో నారా రోహిత్. చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేశాడు. కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.
అయితే, ఈ మధ్య పెద్దగా నారా రోహిత్ సినిమాలు పాపులర్ కావడం లేదు. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడే ఓ ప్రత్యేకమైన సినిమాతో రాబోతున్నాడు.
నారా రోహిత్ కెరీర్ తొలి నాళ్లలో చేసిన సినిమా ‘ప్రతినిధి’. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని సూటిగా ఎత్తి చూపిన సినిమా ఇది. మీడియాని కూడా ఏకి పారేసింది.
అలాంటి కథనంతోనే ఆ సినిమాకి సీక్వెల్‌గా రాబోతోంది ‘ప్రతినిధి 2’. ఈ సినిమాతో రీపోర్టర్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.చిత్రానికి కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు.
‘ఈ దేశం అప్పు ఎంత.?’ ఇలాంటి ప్రశ్నలు హీరో నోటి వెంట ఈ సినిమా ద్వారా పలికించబోతున్నాడట మూర్తి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు రేకెత్తిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?