పారిశ్రామిక జోన్లలో $3.7 బిలియన్ పెట్టుబడులు

- March 30, 2024 , by Maagulf
పారిశ్రామిక జోన్లలో $3.7 బిలియన్ పెట్టుబడులు

బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఏడు పారిశ్రామిక జోన్లలో మొత్తం నమోదైన పెట్టుబడులు $3.7 బిలియన్లకు చేరుకున్నాయి. షురా కౌన్సిల్ సభ్యుడు ఖలీద్ అల్ మస్కతి సమర్పించిన నివేదికను ఉద్దేశించి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి హిస్ ఎక్సెలెన్సీ అబ్దుల్లా ఫఖ్రో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం 851 పారిశ్రామిక ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 91% లీజుకు తీసుకున్నవేనని మంత్రి తెలిపారు. మొత్తం ప్రాంతంలో కేవలం 9% మాత్రమే అందుబాటులో ఉందన్నారు. జోన్‌లు సదరన్ గవర్నరేట్, క్యాపిటల్ గవర్నరేట్ మరియు నార్తర్న్ గవర్నరేట్ అనే మూడు గవర్నరేట్‌లలో మొత్తం 14.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com