ఏప్రిల్‌లో ఇంధన ధరలు పెరుగుతాయా?
- March 30, 2024
యూఏఈ: ఏప్రిల్ నెలలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించనుంది. 2015లో ప్రకటించిన నియంత్రణ సడలింపు విధానంలో భాగంగా ప్రతి నెలాఖరున అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను సవరిస్తారు. యూఏఈలో పెట్రోల్ ధరలు మార్చిలో సూపర్ 98, స్పెషల్ 95 మరియు E-Plus 91 లీటరుకు Dh3.03, Dh2.92 మరియు Dh2.85 చొప్పున ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా మార్చిలో చమురు ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ డిమాండ్ వృద్ధిని పెంచడంతో మార్చి మధ్యలో క్రూడ్ ధరలు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. డబ్ల్యుటిఐ క్రూడ్ ఔన్స్‌కు 2.24 శాతం పెరిగి 83.17 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ 1.86 శాతం పెరిగి $87.0 వద్ద ట్రేడవుతోంది. మార్చి 2024లో బ్రెంట్ బ్యారెల్ సగటున $84.25గా(గత నెలలో $81.3తో పోలిస్తే) ఉంది. మార్చిలో సగటు ధరలో ఈ $3 పెరుగుదల కారణంగా ఏప్రిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలను శనివారం లేదా ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'