పుస్తకాల ఉచిత మార్పిడి కోసం యాప్ సృష్టించిన స్టూడెంట్

- March 31, 2024 , by Maagulf
పుస్తకాల ఉచిత మార్పిడి కోసం యాప్ సృష్టించిన స్టూడెంట్

యూఏఈ: విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పుస్తకాలతో ఏమి చేయాలో ఒక పరిష్కారాన్ని ఓ స్టూడెంట్ చూపించాడు.  17 ఏళ్ల దుబాయ్ విద్యార్థి పుస్త‌కాల‌ను విరాళంగా ఇవ్వడానికి, విక్రయించడానికి లేదా ప్రీ-యాజమాన్య పుస్తకాలను కొనుగోలు చేయడానికి ఒక యాప్‌ను రూపొందించాడు. ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ షార్జా హెడ్ బాయ్ రుద్రాక్ష్ భండారి మాట్లాడుతూ.. తాను రూపొందించిన మొబైల్ యాప్ విద్యా వనరులను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, పుస్తక ఉత్పత్తి ద్వారా పర్యావరణంపై ప‌డే ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు.ShareAllBooks అని పిలువబడే ఈ యాప్ Apple మరియు Google Play స్టోర్‌లు మరియు Apple App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉందని చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com