పంజాబ్‌లో విషాదకర ఘటన..కేక్ తిని 10 ఏళ్ల చిన్నారి మృతి
- March 31, 2024
పంజాబ్: పుట్టినరోజు నాడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ తిని మాన్వీ అనే పదేళ్ల బాలిక మరణించిన ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ కారణంగా బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. కేక్ తిన్న తర్వాత కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని బాలిక తాతయ్య చెప్పాడు. మృతురాలి చెల్లెలు కూడా స్పృహ తప్పిపడిపోయిందని, పాటియాలలోని ‘కేక్ కన్హా’ బేకరీ నుంచి ఈ కేక్‌ను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టు వెల్లడించాడు. మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి 10 గంటల సమయంలో బాలిక సహా, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు. అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పాడు. విపరీతంగా దాహం అవుతోందంటూ మాన్వీ మంచినీళ్లు అడిగిందని, నోరు ఆరిపోతోందని చెప్పిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకుందని వివరించాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించిందని గుర్తించి ఆసుపత్రికి తరలించామని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు.
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!