బీజేపీ మళ్లీ గెలిస్తే ఏం జరుగుతుందో చెప్పిన రాహుల్
- March 31, 2024
న్యూ ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, మన దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తే దేశం అగ్ని గుండాన్ని తలపించేలా ఉంటుందని చెప్పారు.
ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం ప్రజల గొంతుకవంటిదని, అది లేనిరోజు దేశమూ ఉండదని చెప్పారు. పేదల నుంచి రాజ్యాంగాన్ని లాక్కోవాలని ముగ్గురు-నలుగురు ఆశ్రిత పెట్టుబడుదారులతో ప్రధాని మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్నవి సామాన్య ఎన్నికలు కాదని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఎన్నికలని రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలు సరిగ్గా ఆలోచించి ఓటువేయకపోతే మోదీ చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ గెలుస్తుందని చెప్పారు. అదే గనుక జరిగితే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తారని అన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని ఓ బీజేపీ ఎంపీ కూడా అన్నారని చెప్పారు.
రాంలీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, జమ్మూకశ్మీర్ ఎన్సీ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, ఝార్ఖండ్ సీఎం చంపాయ్ సోరెన్, ఇతర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన