‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
- March 31, 2024హైదరాబాద్: ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్ చేసి తెలుగులోకి కూడా తీసుకు రావడం ఆనవాయితీగా మారిపోయింది. 2018, ప్రేమలు సినిమాలు తెలుగులో రిలీజయ్యి సూపర్ హిట్స్ గా నిలిచింది.ఇక రీసెంట్ గా మలయాళంలో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ అయిన సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజయిన ఈ చిత్రం న్యూ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.
కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించింది.ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాదించడడంతో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఏప్రిల్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో నేడు ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు.. పలువురు మలయాళ యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఓ గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు. ఆ గుహ లోపల ఓ లోయలో ఒక ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్లంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్, ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్