భూ చక్రగడ్డ.! ఈ దుంపలోని ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

- April 01, 2024 , by Maagulf
భూ చక్రగడ్డ.! ఈ దుంపలోని ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

చాలా అరుదుగా కనిపించే ఈ దుంపను రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. బాగా వాడుకలో వున్న పేరు ‘భూ చక్రగడ్డ’. దుంప జాతికి చెందిన దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో ఈ దుంప బాగా తోడ్పడుతుంది. రేర్‌గా దొరికే ఈ గడ్డను సీజన్‌లో తినడం వల్ల ఊబకాయం తగ్గుతుందట.
అలాగే, ఈ దుంపలో ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఈ దుంపకు పుష్కలంగా వుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సితో పాటూ అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఈ దుంపలో వున్నాయట.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటూ, ఐరన్ డెఫిషియన్సీని సైతం దరి చేరకుండా చేస్తుందట. ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న ఈ భూచక్ర గడ్డను ఆయుర్వేదంలో ప్రముఖంగా వినియోగిస్తుంటారు.
దీనిలో పుష్కలంగా వుండే ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది. తద్వారా ఈజీగా బరువు తగ్గుతారట. హృదయ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, గుండె జబ్లుల ప్రమాదాన్ని నివారిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com