ఖతార్లో అరుదైన తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభం
- April 02, 2024
దోహా: పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) సముద్ర తాబేలు నెస్టింగ్ సీజన్ ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 1 వరకు ఉంటుందని వెల్లడించింది. అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు దేశంలోని ఉత్తర తీరాలలో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయని, ముఖ్యంగా ఖతార్లో గూడు కట్టుకున్న హాక్స్బిల్ తాబేళ్లతో సహా సముద్ర తాబేళ్లు వలస జాతులలో ఒకటిగా పరిగణించబడతుందని పేర్కొంది. సముద్ర తాబేళ్లను రక్షించడం, సంరక్షించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపింది. ఏటా, సముద్ర తాబేళ్లు ఖతార్ యొక్క ఉత్తర తీరాల వెంబడి ఒక గూడులో 75 నుండి 100 గుడ్లు పెడతాయని, రాష్ట్ర సముద్ర వాతావరణంలో గొప్ప జీవవైవిధ్యం మరియు పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ హాక్స్బిల్ సముద్ర తాబేళ్లను తీవ్రంగా అంతరించిపోతున్నట్లు వర్గీకరించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు