ఎన్టీయార్ మెచ్చిన ‘టిల్లు స్క్వేర్’.!

- April 03, 2024 , by Maagulf
ఎన్టీయార్ మెచ్చిన ‘టిల్లు స్క్వేర్’.!

రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టిల్లు స్క్వేర్’‌కి అంతకంతకూ పాపులారిటీ పెరిగిపోతోంది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది.
అలాగే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాకి బాగానే సపోర్ట్ చేస్తున్నట్లున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ సపోర్ట్ బాగా అందింది ‘టిల్లు స్క్వేర్’కి.
తాజాగా ఎన్టీయార్ ఈ సినిమాని వీక్షించారు. మంచి రివ్యూ ఇచ్చారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఎన్టీయార్‌తో పాటూ, విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని చూశారట.
విశ్వక్ సేన్, ఎన్టీయార్‌కి వీరాభిమాని. నాగవంశీ ప్రొడక్షన్‌లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సో, అలా ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమాని వీక్షించారట. సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. దాంతో మరింత వెయిట్ పెరిగినట్లయ్యింది ‘టిల్లు స్క్వేర్’కి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com