‘విశ్వంభర’ యాక్షన్.! మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్.!

- April 03, 2024 , by Maagulf
‘విశ్వంభర’ యాక్షన్.! మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్.!

వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయ్యింది.
సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా వున్నారు మెగాస్టార్ అండ్ టీమ్. బీభత్సమైన యాక్షన్ షూట్ చేస్తున్నారట ఈ షెడ్యూల్‌లో.
భయంకరమైన ఎండలను సైతం లెక్క చేయకుండా చిరంజీవి ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీలో ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.
హైద్రాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో ఈ యాక్షన్ బ్లాక్ షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com