అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి
- April 04, 2024
న్యూ ఢిల్లీ: ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ద్వారా అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు ఎంతోమంది. కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టినా కళ్లు కప్పి తరలిస్తున్నారు. అంతేకాదు.. కొత్త కొత్త పద్దతుల్లో బంగారం తరలిస్తూ షాక్ ఇస్తున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1200 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఇతను దుబాయ్ నుంచి వస్తున్నాడు. ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో నిందితుడిపై నిఘా వేసి అధికారులు అడ్డుకున్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రయాణికుడిని అరెస్టు చేశామని, రూ.71.16 లక్షల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడని ఢిల్లీ కస్టమ్స్ తెలిపింది. విమానం సీటు కింద దాచిన స్మగ్లింగ్ బంగారాన్ని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1962 కస్టమ్స్ చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారం స్మగ్లర్లు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. కాగా మార్చి 21న సౌదీ అరేబియాలోని మదీనా నుంచి వచ్చిన విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడి నుంచి రూ.57.9 లక్షల విలువైన 995 గ్రాముల బంగారాన్ని ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







