‘దేవర’కి పెరుగుతున్న గ్లామర్.!

- April 04, 2024 , by Maagulf
‘దేవర’కి పెరుగుతున్న గ్లామర్.!

‘దేవర’కి పెరుగుతున్న గ్లామర్.! జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’కి గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీఫుల్ జాన్వీకపూర్ హీరోయిన్‌గా సెట్ అయ్యింది. జాన్వీని అందంగా చూపిస్తూనే గ్లామరస్‌గానూ చూపించబోతున్నారని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా అర్ధమవుతోంది. అలాగే, ఓ మరాళీ బ్యూటీ ఈ సినిమాలో సెకండ్ కీ రోల్ పోషిస్తున్నదన్న ప్రచారం వుంది. అలా ఇద్దరు హీరోయిన్లు పక్కాగా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఓ స్పెషల్ సాంగ్ కూడా వుండబోతోందనీ, ఆ సాంగ్ కోసం మరో బాలీవుడ్ బ్యూటీని తీసుకురాబోతున్నారనీ తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌ని సినిమాలో ప్రత్యేకమైన సందర్భంలో సెట్ చేయనున్నారట. అలాగే, ఆ సాంగ్‌లో నటించే ముద్దుగుమ్మ కూడా ఓ ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారన్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గౌరవం దక్కించుకున్న ఎన్టీయార్ నటిస్తున్న చిత్రమిది. అందుకే, అంచనాలు భారీగా వున్నాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com