వారియర్ క్వీన్.! నభా నటేష్ జాయిన్ విత్ నిఖిల్.!
- April 04, 2024
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నభా నటేష్. స్టార్ హీరోయిన్ హోదా అందుకుంటుందన్న టైమ్‌లో కాలం కలిసి రాలేదు.
ఓ యాక్సిడెంట్ ఆమె తలరాతను మార్చేసింది. దాంతో కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది నభా నటేష్.
అందులో భాగంగా ప్రియదర్శి హీరోగా వస్తున్న ఓ కామెడీ సినిమాకి కమిట్ అయ్యింది. దాంతో పాటూ, ప్యాన్ ఇండియా స్టార్ నిఖిల్‌తో ‘స్వయంభు’ సినిమాలోనూ నటిస్తోంది.
ఈ సినిమాలో నభా నటేష్ వారియర్ క్వీన్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది నభా నటేష్. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన లుక్ ఆమె పాత్రపై క్యూరియాసిటీ పెంచేలా వుంది.
ముక్కుకు ముక్కెర, పాపిట బిళ్ల, పద్ధతైన చీరకట్టు.. నిండుతనం వుట్టిపడేలా కనిపిస్తోంది. ఈ లుక్ చూస్తుంటే.. మళ్లీ లక్కు కళ నభా నటేష్‌కి దక్కేలానే అనిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్‌లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







