నేషనల్ క్రష్మిక
- April 05, 2024
"కిర్రీక్ పార్టీ"తో కన్నడిగులు మదిని దోచి, "ఛలో"తో తెలుగు యువత గుండెల్లో పులకరింతలు గురి చేసి వాళ్ళ క్రాష్ గా మారిన క్రేజీ యాక్ట్రస్ రష్మిక మండన్న.నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన ఈ భామ పుట్టిన రోజు నేడు .
ఏప్రిల్ 5,1996న కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లా విరాజ్ పేట్‌లో కొడవ కుటుంబానికి చెందిన సుమన్, మదన్ మండన్నలకు రష్మిక జన్మించింది.రష్మిక ప్లస్ టూ వరకు కొడుగు జిల్లాలోనే జరిగింది. బెంగుళూరులోని ఎం.ఎస్,రామయ్య కాలేజీలో జర్నలిజం, సైకాలజీలలో డిగ్రీ పూర్తి చేసింది.18 ఏళ్లకే బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో రష్మిక చోటు సంపాదించింది
మోడలింగ్ చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ 10కిపైగా ఆడిషన్స్ ఇచ్చింది. తను ఇంటర్మీడియేట్ లో ఉండగా కన్నడ చిత్రం ‘కిర్రాక్ పార్టీ’లో అవకాశం దక్కింది. ఈ చిత్రంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టికి రష్మిక జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కావడం రష్మికకు ఆఫర్లు క్యూ కట్టాయి. కిర్రాక్ పార్టీ చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డు అందుకుంది.
నాగ శౌర్యతో నటించిన ‘ఛలో’ సినిమా రష్మికకు తెలుగులో మొదటి చిత్రం. ఆ తర్వాత నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప : ది రైజ్ చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. టాలీవుడ్ లో బిజీగా ఉన్న సమయంలోనే కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను చూసింది. అటు కన్నడ, తమిళం, బాలీవుడ్ లోనూ బడా హీరోల సరసన నటిస్తూ కేవలం 7 సంవత్సరాల్లోనే అగ్రస్థాయి హీరోయిన్ గా ఎదిగింది.
తన అందం, అభినయం, హావభావాలతో యువత రష్మికను కాస్త క్రష్మికగా మార్చేశారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ ‘పుష్ప 2 : ది రూల్’ సినిమాతో పాటు లేడి ఓరియెంటెడ్ సినిమా రెయిన్ బోతో ఈ సంవత్సరం పలకరించబోతుంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..