క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులు
- April 05, 2024
హైదరాబాద్: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ.. టీఎస్ఆర్ టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్ కోసం 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు దీనికి సంబందించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
ఇవ్వాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎస్ మ్యాచ్ కు మీ సోంత వాహానాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి అని సూచించారు.
అలాగే ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని తెలిపారు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి టీఎస్ ఆర్టీసీ నడుపుతోందని, ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయని తెలియజేశారు. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం క్రికెట్ అభిమానులను కోరుతోంది అని వీసీ సజ్జనార్ ఎక్స్ ద్వారా సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







