ఐపీఎల్-2024లో మొట్టమొదటి సెంచరీ బాదిన కోహ్లీ..
- April 06, 2024
జైపూర్: ఐపీఎల్-2024లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచులో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. 67 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సులతో శతకం సాధించాడు. ఐపీఎల్-2024లో ఇదే మొదటి సెంచరీ. ఐపీఎల్‌లలో విరాట్ కోహ్లీకి ఇది ఎనిమిదో శతకం.
ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు
విరాట్ కోహ్లీ -8 సెంచరీలు
క్రిస్ గేల్ – 6 సెంచరీలు
జోస్ బట్లర్ -5 సెంచరీలు
కేఎల్ రాహుల్ -4 సెంచరీలు
డేవిడ్ వార్నర్ -4 సెంచరీలు
షేన్ వాట్సన్ -4 సెంచరీలు
కాగా, టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113(నాటౌట్), డుప్లెసిస్ 44, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1, సౌరభ్ చౌహన్ 9, గ్రీన్ 5 (నాటౌట్) పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ 2, బర్గర్ ఒక వికట్ తీశారు.
బెంగళూరు జట్టు: డుప్లెసిస్, కోహ్లీ, రజత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, చౌహాన్, రీస్ టాప్లీ, మయాంక్ దగార్, సిరాజ్, యశ్ దయాల్
రాజస్థాన్ జట్టు: సంజూ శాంసన్, జైస్వాల్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, ధ్రువ్, షిమ్రాన్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నాంద్రి బర్గర్, యజువేంద్ర చాహెల్
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..