డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం సబ్జా గింజలు.!
- April 06, 2024
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అనేక రకాల జ్యూస్‌లు ఆశ్రయిస్తుంటాం. ముఖ్యంగా ఈ వేసవి కాలం డయాబెటిస్ వ్యాధిగ్రస్థలు పాలిట శాపంగా చెప్పొచ్చు.
డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఎక్కువ శాతం మలబద్ధకం సమస్యతోనూ బాధపడుతుంటారు. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయితే అది నయం కాదు. కానీ, కంట్రోల్‌లో వుంచుకోవడం సాధ్యమే.
అందుకోసం కొన్ని ఇంటి చిట్కాలు మంచి ఫలితాల్నిస్తాయ్. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో వుంచడానికి, అలాగే మలబద్ధకం సమస్యను నివారించడానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయ్.
ఆ మాటకొస్తే.. సబ్జా గింజలు వేసవి అమృతంగా అభివర్ణించొచ్చు. చిన్న, పెద్ద.. అన్ని ఏజ్ గ్రూపుల వారూ వీటిని తీసుకోవచ్చు. అనేక రకాలుగా వీటిని తీసుకోవచ్చు.
వాటర్‌లో నానబెట్టిన సబ్జా గింజలను కాస్త నిమ్మకాయ రసం, ఉప్పు, షుగర్ కలిపి షరబత్‌లా తీసుకోవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు నిమ్మ రసం చేర్చి లేదంటే నీటిలో కలుపుకుని వట్టిగానే తీసుకోవచ్చు.
ఖాళీ కడుపుతో సబ్జా గింజల్ని తీసుకుంటే డయాబెటిస్ వాళ్లకి మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు చెబుతున్నారు. సబ్జా గింజల్లో కావల్సినంత ప్రోటీన్లు, ఫైబర్, మంచి కొవ్వులు, కార్భో హైడ్రేట్లు పుష్కలంగా వుంటాయ్.
అందుకే తక్షణ శక్తినివ్వడంతో పాటూ, మలబద్ధకం సమస్య తీర్చడంలోనూ ఉపయోగపడతాయ్. ప్రతీరోజూ సబ్జా గింజలు తీసుకున్నా చాలా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







