డెలివరీ రైడర్‌కు ఈద్ అల్ ఫితర్ సర్ ప్రైజ్ బహుమతి

- April 06, 2024 , by Maagulf
డెలివరీ రైడర్‌కు ఈద్ అల్ ఫితర్ సర్ ప్రైజ్ బహుమతి

దుబాయ్: దుబాయ్ లో ఉంటున్న గాంబియన్ నివాసితుడికి దాతలు అండగా నిలిచారు. ఓ వార్త కథనంలో తన ఆవేదనను చూసిన పలువురు అతనికి సాయం నిలిచారు.  రాబోయే ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇంటికి వెళ్లి తన కుటుంబంతో కలిసి ఉండటానికి అతనికి విమాన టిక్కెట్‌ను అందించేందుకు ముందుకువచ్చారు. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన బకరీ ఇప్పుడు దుబాయ్‌లో ఉపవాసాలను పాటిస్తూ కూడా తన రైడర్ విధులను నెరవేర్చుతున్నాడు.  ఈ క్రమంలో ఉత్పత్తి డెలివరీల కోసం డెలివరూ రైడర్‌లను ఉపయోగించుకునే స్విచ్ ఫుడ్స్ అనే కంపెనీ రాబోయే ఈద్ అల్ ఫితర్ కోసం ఇంటికి తిరిగి వెళ్లడానికి అవసరమైన విమాన టిక్కెట్ ను అందించేందుకు ముందుకువచ్చింది.  "నేను చాలా సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నాను. ఏమి చెప్పాలో కూడా నాకు తెలియదు" అని అతను హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఇంత త్వరగా వారిని కలిసే అవకాశం వస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు.  మరోవైపు యూఏఈలోని ముస్లింలు ఏప్రిల్ 9 లేదా 10 తేదీలలో ఈద్ అల్ ఫితర్‌ను జరుపుకోనున్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com