‘పుష్ప మాస్ జాతర’ మొదలైందిగా.!

- April 06, 2024 , by Maagulf
‘పుష్ప మాస్ జాతర’ మొదలైందిగా.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్లు మొదలెట్టేశాడనిపిస్తోంది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఎటువంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ఊహించని విధంగా సంచలనాలు నమోదు చేసింది. ఆ అంచనాలను దాటి వుండేలా ఈ రెండో పార్ట్ చిత్రీకరిస్తున్నారు సుక్కు అండ్ టీమ్.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో రెండు రోజుల్లో అనగా ఏప్రిల్ 8న మరో సర్‌ప్రైజ్ రానుందని ఓ లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ కన్‌ఫామ్ చేసింది.
ఆ సర్‌ప్రైజ్ ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే అంశంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com