రేపే అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం
- April 07, 2024
న్యూ ఢిల్లీ: ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంపూర్ణ సూర్యగ్రహణం రేపు(ఏప్రిల్ 8న) కనిపించనుంది. భారతదేశంతో సహా చాలా ఆసియా దేశాలలో ఇది కనిపించదు. ఉత్తర మరియు మధ్య అమెరికా అంతటా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాల 28 సెకన్ల పాటు ఉంటుందని అంచనా. ఈ సమయంలో ఆయా ప్రాంతాలు పూర్తిగా చీకటిగా ఉంటాయి. చంద్రుని నీడ సూర్యుడిని కప్పి ఉంచడం వల్ల ఈ చీకటి ఏర్పడుతుంది. మరో 21 ఏళ్ల తరువాత మరో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడదని, ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం అరుదైన అనుభూతిని కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమయంలో నక్షత్రాలు కూడా కనిపిస్తాయి.
ఏప్రిల్ 8న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటల నుండి ఏప్రిల్ 9 తెల్లవారుజామున 2.22 గంటల వరకు సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణాన్ని తప్పనిసరిగా సోలార్ ఫిల్టర్లతో వీక్షించాలి. అసురక్షిత లెన్స్‌లతో వీక్షించడం వల్ల తీవ్రమైన కంటి దెబ్బతినవచ్చు. నాసా మూడు గంటల పాటు ఉత్తర అమెరికాలోని అనేక ప్రదేశాల నుండి ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను ప్రసారం చేయనుంది. నాసా లైవ్ ఏప్రిల్ 8 రాత్రి 10.30 నుండి ఏప్రిల్ 9 తెల్లవారుజామున 1.30 వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..