యూఏఈలో 30 శాతం పెరిగిన డీహైడ్రేషన్ కేసులు

- April 08, 2024 , by Maagulf
యూఏఈలో 30 శాతం పెరిగిన డీహైడ్రేషన్ కేసులు

యూఏఈ: పవిత్రమైన ర‌మ‌దాన్ మాసం ముగుస్తున్నందున, యూఏఈ ఆసుప‌త్రుల‌లో డీహైడ్రేషన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.  ప్రధానంగా ఉపవాసం ఉన్న నివాసితులలో తీవ్రమైన డీహైడ్రేషన్, పొట్టలో పుండ్లు సంభవించడం దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎమర్జెన్సీ కేసుల‌లో ఈ త‌ర‌హావి సుమారు 30-35 శాతం పెరుగుదల న‌మోదైంది. ఇది ఉపవాస నివాసులు ఎదుర్కొంటున్న నిరంతర ఆరోగ్య సవాళ్లను తెలియ‌జేస్తుంద‌ని జనరల్ ప్రాక్టీషనర్-ఎమర్జెన్సీ విభాగం డాక్టర్ తస్నుబా అక్తర్ చెప్పారు. "ఉపవాసం చేసే వ్యక్తులు తరచుగా పొట్టలో పుండ్లు కారణంగా పొత్తికడుపు నొప్పిని అనుభవిస్తారు. వారు వెంట‌నే వైద్య సంరక్షణను ఆశ్రయించాలి.  అంతేకాకుండా, ర‌మ‌దాన్ సమయంలో తీవ్రమైన డీహైడ్రేషన్ ముఖ్య‌మైన‌ ఆందోళనగా ఉంది. ”అని డాక్టర్ అక్తర్ తెలిపారు.

డీహైడ్రేషన్ లక్షణాలు
అలసట, బలహీనత, మైకము మరియు తలతిరగడం, వేగవంతమైన గుండె స్పందన రేటు,  శ్వాస, తలనొప్పి, వికారం మరియు వాంతులు, తక్కువ రక్తపోటు. ఈ లక్షణాలు క‌నిపించ‌గానే తక్షణం వైద్య సంరక్షణను పొందాల‌ని RAK హాస్పిటల్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ అహ్మద్ ఫడ్లాల్సీడ్ చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com