లోక్సభ ఎన్నికలు 2024
- April 08, 2024
ఏప్రిల్, మే నెలలు భారతదేశంలో ఎన్నికల నెలలు. 2024 లోక్సభ ఎన్నికలు ఈ రెండు నెలల్లో ఏడు విడతల్లో జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.ప్రస్తుత 17వ లోక్సభ పదవీకాలం 16 జూన్ 2024తో యుగియనుంది. జూన్ 16 లోపు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
2019 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు 17వ లోక్సభ సార్వత్రిక ఎన్నికకు ఏడు విడతల్లో ఓటింగ్ నిర్వహించి.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆ ఎన్నికల్లో దాదాపు 91.2 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 67 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 303 సీట్లను కైవసం చేసుకొని దేశ అధికార పగ్గాలు చేపట్టింది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 37.36 శాతం, కాంగ్రెస్కు 19.49 శాతం ఓట్లు దక్కాయి.
మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉండగా, అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన మెజారిటీకి 272 సీట్లు అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 83 ప్రకారం, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. 18వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ఇప్పటికే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది.ఏప్రిల్ 19 నుండి ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతాయని ఎన్నికలు జరుగుతాయి.
జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 30కి పైగా పార్టీలు చేరగా, కాంగ్రెస్ తదితర విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. అత్యధికంగా యూపీలో 80 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్లో 42, బీహార్ 42, తమిళనాడు 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.మోదీ చరిష్మా మీదే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆధారపడిన బీజేపీ , ఈసారి కూడా మోదీనే నమ్ముకొని ఎన్నికల గోదాలోకి దిగుతుంది. అయితే బీజేపీని మూడోసారి అధికారంలోకి రానియకుండా నిలువరించేందుకు విపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
--డి.వి.అరవింద్ (మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు