తెలంగాణ: 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం

- April 08, 2024 , by Maagulf
తెలంగాణ: 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

కాగా, ఇవాళ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, జోగులాంబ గద్వాల, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయని తెలిపింది.

కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు చెప్పింది. కొన్ని జిల్లాల్లో ఇవాళ సాయంత్రం వరకు వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని రోజులుగా జనాలు ఎండల వేడిమితో అల్లాడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. వానలు కురిస్తే వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com