హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్..
- April 08, 2024
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న గ్యాంగ్ ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్, ఎస్ఓటీ ఆర్సీపురం పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ గ్యాంగ్ ఆటకట్టించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 18 లక్షల 50 వేల రూపాయల నగదుతో పాటు బ్యాంకు ఖాతాలోని 18 లక్షల 34 వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కలిపి రూ.37,84,918 స్వాధీనం చేసుకున్నారు.
డిల్లీ కేంద్రంగా ఓ ఆన్ లైన్ యాప్ రూపొందించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఈ గ్యాంగ్. ఆ యాప్‌తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా? అన్న వివరాలపై విచారణ జరుపుతున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?