తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం
- April 08, 2024
హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. అక్కడే ఐదు కోట్ల విలువ కలిగిన చెక్స్ అందించారు. ఇది చిన్న మొత్తమే అని, అడగకపోయినా ప్రజల కోసం కష్టపడుతున్నందుకు తాను ఇస్తున్న కానుక అని ఆశీర్వదించారు. విజయంతో తిరిగి వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్ భరోసాగా తెలిపారు. విజయీభవ అని చిరంజీవి అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?