మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్‌పైనే తొలి సంతకం: సీఎం జగన్
- April 08, 2024
అమరావతి: ఏపీలో ప్రచారపర్వం జోరందుకుంది. మేమంతా సిద్దం యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారాయన జనంలో జగన్… జగన్‌తో జనం… సీఎం జగన్ ప్రచారపర్వంతో మేమంతా సిద్ధం బస్సుయాత్ర వైసీపీలో జోష్‌ను పెంచింది. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో పెన్షన్ లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాయంటూ పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. నువ్వే కావాలి..మళ్లీ నువ్వే రావాలంటూ నినాదాలు చేశారు.
అవ్వతాతల కళ్లలో ఆనందం చూడ్డమే తమ లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామన్నారు సీఎం జగన్.కుల,మత, పార్టీలకు అతీతంగా గడప గడపకు పెన్షన్లు అందించిన ఘనత వైసీపీదన్నారు. నెలకు రూ.2 వేల కోట్లు పెన్షన్లకే కేటాయిస్తున్నామన్నారు. చెప్పానంటే కచ్చితంగా చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబు, కూటమి నేతల తరహాలో అబద్దాలు చెప్పడం తనకు రాదన్నారు సీఎం జగన్. అందరి ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థపైనే తొలి సంతకం పెడతామన్నారు సీఎం జగన్. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మేమంతా సిద్దం యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించింది. వినుకొండలో వైసీపీ శ్రేణులు, ప్రజలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గంటావారిపాలెంలో బస చేస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?