తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూత
- April 09, 2024
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతిచెందారు. తెల్లవారు జామున ఆయనకు ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. రాజీవ్ రతన్ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐపీఎస్ అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు సంతాపం తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
2004 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. ఫైర్ సర్వీస్ డీజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలోని అనేక విభాగాల్లో పనిచేసి ఎంతో పేరు ప్రతిష్టలు గడించారు. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్.. కాళేశ్వరం, మేడగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డికి రాజీవ్ రతన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







