బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
- April 09, 2024న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై..తీహార్ జైల్లో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత రిమాండ్‌ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
కవితతో రెండు నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరుఫు లాయర్ జడ్జిని కోరారు. కవిత లాయర్ విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. నిందితురాలు నేరుగా మాట్లాడే హక్కు ఉంటుందన్న కవిత తరపు న్యాయవాది వాదించగా.. అప్లికేషన్ ఇవ్వాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. దీంతో కోర్టులో హాలులో భర్త, మామను కలిసేందుకు కవిత తరుఫు న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. జడ్జి అనుమతితో కోర్టు హాలులో కవితను ఆమె భర్త అనిల్, మామ రామకిషన్రావు కలిశారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం