ఎక్కువగా చెమట పడుతోందా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!
- April 10, 2024చెమట పట్టడం అనేది చాలా సర్వ సాధారణమైన విషయం. అయితే కొందరిలో ఎక్కువగా చెమట పడుతుంటుంది. కొందరిలో తక్కువగా చెమట పడుతుంటుంది. చెమట పట్టడం అంటే, శరీరంలోని వ్యర్ధాలు, ట్యాక్సిన్లను శరీరం నుంచి బయటికి పంపించడం.
నిపుణుల సూచన మేరకు ఎక్కువగా చెమటలు పట్టేవారికి ఆరోగ్యం కూడా ఎక్కువే అంటున్నారు. ఎందుకంటే, శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, ట్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు బయటికి పోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వుంటాయ్.
అలాగే, తక్కువగా చెమట పట్టే వారు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అనిపించినా.. అది భవిష్యత్తులో ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత జీవన శైలిలో చెమట చిందించే పనులు తక్కువైపోయాయ్. రోజంతా ఏసీ రూముల్లో కూర్చుంటుంటే శరీరానికి తగిన చెమట పట్టడం లేదు. తద్వారా రకరకాల అనారోగ్యాలు ప్రళయ తాండవం చేస్తున్నాయ్.
అందుకే కొందరు ఖచ్చితంగా చెమట పట్టించడానికి తగిన వర్కవుట్లు గట్రా చేస్తున్నారు. ఏదో ఒక రకంగా శరీరం లోపల వున్న వ్యర్ధాలను బయటికి పంపించేయాలి. అందుకు శరీరాన్ని చెమట పట్టించేలా కష్టపెట్టడం తప్పనిసరి.. అని నిపుణుల సలహా. అంతేకాదండోయ్. చెమట పట్టించడమే కాదండోయ్, తగినంత వాటర్ కంటెంట్ కూడా బాడీకి అందిస్తుండాలి. లేదంటే, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయ్ తస్మాత్ జాగ్రత్త.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ